సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆక్వా కనెక్ట్ “ఇండస్ట్రీ రీసెర్చ్ మీట్” సదస్సు ను నేడు శనివారం ఉదయం ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసి) సహకారంతో మరియు విశ్వ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టిబిఐ) నేతృత్వంలో నిర్వహించారు. ఆక్వా రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన సాంకేతిక పరిష్కారాలను కనుగొనడం కోసం ఈసమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశంలో ఆక్వా రైతులు, ఫీడ్ డెవలప్మెంట్ వ్యక్తులు, ఆక్వా మెడిసిన్ఉత్పత్తిదారులు, ప్రభుత్వ అధికారులు మరియు సంబంధిత శాస్త్రవేత్తలు, ఆక్వా ఎగుమతిదారులు భారీ సంఖ్యలో పాల్గొని, తమ అమూల్యమైన సలహాలు , నూతన పరిశోధన ఫలితాలను,సాంకేతిక పరిష్కారాలను సదస్సులో వివరించారని కళాశాల పిరిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ శ్రీ కె. ఆదిత్య విస్సమ్ మాట్లాడుతూ.. జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల సాంకేతికాభివృద్ధిని మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సాంకేతిక పరిష్కారాలను కనుగొనడానికి విద్యాసంస్థలు మరియు పరిశ్రమలు కలిసికట్టుగా పనిచెయ్యాలన్నారు. ఇంకా , డాక్టర్ ఎ. దేవీ వరప్రసాద్ రెడ్డి, శాస్త్రవేత్త (మత్స్యశాఖ), కె.వి.కె., డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం (డా. వైఎస్ఆర్ హెచ్య్య) ఎ.పి.ఫిషరీస్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ & హెడ్ ప్రొఫెసర్ టి. నీరజ తమ విలువైన సూచనలు చేసారు. తదనంతరం శ్రీ విష్ణు .. సీఈఓ అయినటువంటి డాక్టర్ భుబేష్ కుమార్ బెయిన్ మింగ్ సెషన్ ను నిర్వహించారు. ఈ సదస్సులో విష్య టిబిఐ సిఇఓ డాక్టర్ ఎం.కె. కౌషిక్, విష్ణు మహిళా కళాశాల వైస్-పరిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు, ఆక్వా కనెక్ట్ మీట్ కోఆర్డినేటర్లు, డా. జి.ఆర్.ఎల్.వి.ఎన్. శ్రీనివాసరాజు, డాక్టర్ కె. పద్మవాసవి, మరియు అన్ని విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
