సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ దగ్గర సింహాచలం అప్పన్న ను కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శించుకొన్నారు. ఇటీవల తెలుగునాట కూడా ‘కాంతార’ ఘన విజయం సాధించిన విషయం, దానిలో హీరోగా, సినిమాకు దర్శకుడుగా రిషబ్ శెట్టి చూపిన ప్రజ్ఞ దేశవ్యాప్తం చర్చకు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కాంతారా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ ను సందర్శిస్తు.. విశాఖ వచ్చిన రిషబ్ శెట్టి పనిలో పనిగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయం లో స్వా మిని దర్శిం చుకుని పూజల్లో పాల్గొన్నా రు. పం డితులు వేదమం త్రాలతో ఆశీర్వ దించారు.
