సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం బై పాస్ రోడ్డులోని కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు ( హోసాని మందిరం వద్ద) ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధ మహిళా మరణించారు.స్థానికులు చెప్పిన ప్రాధమిక సమాచారం ప్రకారం వివరాలలో కి వెళ్ళితే… వేంపాడు గ్రామానికి చెందిన తల్లి కొడుకులు బైక్ ఫై.. ప్రార్ధనలు కోసం భీమవరం బై పాస్ రోడ్డులో హోసాని మందిరం వద్దకు రాగానే వారి వెనుక నుండి ఒక లారీ వచ్చి వారిని ఢీకొనకుండానే బ్రేక్ వెయ్యడం, దానితో బైకు ఫై యువకుడు కూడా ఆందోళనలతో మొదటి చక్రం బ్రేక్ ఆకస్మికంగా వేసెయ్యడంతో వెనుక కూర్చున్న తల్లి సిమెంట్ రోడ్డు ఫై పడిపోవడం, ఆమె తీవ్రంగా గాయపడి చెవుల నుండి, తలనుండి తీవ్రంగా రక్త స్రావం కావడం తో కొద్దిసేపటికే మరణించింది. స్థానికులు మంచినీళ్లు పట్టించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. లారీ డ్రైవర్ కొద్దీ సేవు అక్కడే ఉండి ఆమె మరణించడంతో భయంతో అక్కడనుండి లారీతో వెళ్లిపోయాడని స్థానికులు అంటున్నారు. వేంపాడు నుండి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. 2 టౌన్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ప్రమాద ఘటన కేసు దర్యాప్తు చేస్తున్నారు.పూర్తీ వివరాలు అధికారికంగా తెలుస్తాయి. అయితే ఈ ప్రమాదం జరిగింది కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ఫై అయినప్పటికీ.. అధికారులు వెంటనే స్వాందించి బై పాస్ రోడ్డు లో గ్యాపుల నిర్మాణాన్ని కూడా త్వరితంగా పూర్తీ చెయ్యవలసి ఉంది. గత 2 నెలల నుండి మన సిగ్మా న్యూస్ .. సగం సగం పనులు బై పాస్ రోడ్డు అంటూ 2 ఐటమ్స్ వెయ్యడంతో ప్రజా ప్రతినిధులు చొరవతో అధికారులు స్వాందించి మధ్యలో పనులు మొదలు పెట్టిన .. వరుస వర్షాలు ? మరే ఏ కారణం చేతనో ఆగిపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *