సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలోనే ఖ్యాతిగాంచిన భీమవరం పట్టణంలోని ప్రముఖ కళాశాల, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ విమెన్ నందు గత శనివారం రాత్రి 2022-23 విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రవేశించిన మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థినుల కొరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థినుల అత్యంత ఉల్లాసంగా ‘ఫ్రెషర్స్ డే’ ను నిర్వహించి వారికి సాదరంగా స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10గంటల వరకు కళాశాల లోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు మరియు వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాస రాజు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేసారు.ఈ ఫ్రెషర్స్ డే లో భాగంగా విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు,చీరకట్టులో వాక్ షో, సాంప్రదాయ నాట్య ప్రదర్శనలు ప్రదర్శించి సభికులను విశేషంగా అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
