సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర సర్కార్ సమర్ధవంతంగా పరిష్కరించలేకపోతుందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపు మేరకు గోదావరి జిల్లాల కు చెందిన తెలుగు దేశం నేతలు దక్షిణ భారతదేశంలోనే ఆక్వా ఎగుమతులకు రాజధానిగా పేరొందిన భీమవరం కేంద్రంగా రేపు సోమవారం ( నవంబర్ 14న} ఆక్వా రైతుల భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రేపు సోమవారం ఉదయం 9:30 గంటలకు ఉండి రోడ్డు లోని కోట్ల ఫంక్షన్ హాల్ వద్ద నుండి జోన్ 2 పరిధిలోని తూర్పు పశ్చిమగోదావరి ఉమ్మడి జిల్లాల ఆక్వా రైతాంగ సమస్యలపై భారీనిరసన ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. . ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, టిడిపి ఇంచార్జ్ లు ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,రాష్ట్ర కమిటీ నాయకులు, పాల్గొంటారని, ఉమ్మడి జిల్లాల ఆక్వా రైతులు, రైతు కూలీలు, ఆక్వా పరిశ్రమ వ్యాపార వేత్తలు పాల్గొనాలని పార్టీ కీలకనేతలు పిలుపు ఇచ్చారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *