సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. రేపు మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దానితో ఇప్పటికే ఉత్తరాంధ్రలో తీరప్రాంతాలలో ఈదురుగాలులతో పాటు చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి.ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కుండపోతగా వర్షం కురిసింది. మూడు రోజులుగా సాధారణ స్థాయిలో కురిసిన వర్షం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. ప్రధానం గా జిల్లాలో కావలి, కొండాపురం , గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నా యి
