సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం పరిస్థితి పై సినీ నటుడు సీనియర్ నరేశ్ తాజగా నేడు, సోమవారం మీడియా సమావేశంలో స్పందించారు. కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను గత ఆదివారం ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం నేటి ఉదయం నుండి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సినీనటుడు నరేశ్ పేర్కొన్నారు. 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారని , అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *