సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి సూపర్ స్టార్ అంటే కృష్ణ మాత్రమే.. జేమ్స్ బ్యాండ్ అన్న కృష్ణ మాత్రమే .. అన్నింటికి మించి మంచి మనిషిని కోల్పొయాము అని సంతాప సందేశం లో పేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి బుధవారం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహేశ్ బాబును ఆలింగనం చేసుకుని తండ్రి పోయిన దు:ఖంలో ఉన్న అతనిని జగన్ ఓదార్చారు. అదే సమయంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు ఉన్న హీరో బాలకృష్ణ , ఎంపీ గళ్ళ జయదేవ్ లకు సీఎం జగన్ అభివాదం చేసారు.నేటి సాయంత్రం 4గంటలకు సూపర్ స్టార్ , మాజీ ఎంపీ కృష్ణ పార్థివ దేహానికి తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో మహా ప్రస్థానంలో ఘనంగా లక్షలాది అభిమాన సందోహం మధ్య వీడ్కోలు పలకనున్నారు.
