సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలోని కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.. ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారంతా వాటిని మరోసారి కొత్తగా మార్చుకోవాలని దానికి అధికారులు సహకరించాలని ఆదేశించారు. ఆధార్ కార్డుల ఆధునీకరణ కోసం ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పేదల గృహ నిర్మాణాల ప్రగతిపై ఇక నుంచి ప్రతి శనివారం అధికారులతో సమావేశం నిర్వహించి నిర్మాణాలలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారించాలని ఆదేశించారు.
