సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి అంజిబాబు నేడు, గురువారం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పద్మావతి యూనివర్శిటీ రిజిస్టర్ లు ఎమ్మెల్యే అంజిబాబు ను మర్యాద పూర్వకంగా కలిసి ఆలయానికి తీసుకుని వెళ్లారు. పద్మావతి అతిధి గృహంలో నేడు, గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు విభాగాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, హోదాలో అంజిబాబు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాల పనితీరుపై స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఎట్టి పరిస్థితులలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఇటీవల టీటీడీలో పరకామణి లెక్కింపుల్లో గతంలో జరిగిన కొన్ని అవకతవకలపై వార్తలు వచ్చాయని, దీనిపై విచారణ చేయటంలో ఎందుకు జాప్యం జరగుతుందని టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి బాధ్యులను శిక్షించాలన్నారు. సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీర బ్రహ్మం, టీటీడీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
