సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భవిషత్తు లో ఇరాన్ అణుబాంబు తయారు చెయ్యకుండా శుద్ధి చేసిన యూరేనియంను అమెరికాకు అప్పగించేందుకుఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరే ఛాన్స్ ఉంది. దాని కోసం నేను స్వయంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇరాన్‌, అమెరికా సంబంధాలు చాలా వరకూ మెరుగుపడ్డాయి. దీన్ని చాలా మంది నమ్మలేకపోవచ్చు. నాలుగు వారాల పాటు సాగిన బాంబు దాడులు, దిగ్బంధనం వంటివి ఫలితాన్ని ఇచ్చాయని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నారు.అయితే, చర్చలు విఫలమైతే మరోసారి దాడులు మొదలుకావొచ్చని కూడా హెచ్చరించారు. వచ్చే వారం కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిపోనున్న విషయం తెలిసిందే. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా ఎద్దేవా చేసింది. ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని హేళన చేసింది అయితే ట్రంప్ మాటలు ముడి చమురు ధరలు పెరగకుండా అడ్డుకొంటున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *