సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. రేపు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చే భీమవరం యనమదుర్రు డ్రైన్ పై నిర్మించిన వంతెనలకు మంజూరైన అప్రోచ్ రోడ్స్కు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజలు 14 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగిందని, రూ 7 కోట్లతో గొల్లవాని తిప్ప బ్రిడ్జి, కలపి రూ 20 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, అదే విధంగా డిఎన్నార్ కళాశాల వద్ద రూ 2 కోట్లతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్డును కూడా వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని తెలిపారు కూటమి నేతలు విశేషంగా రేపు ఉదయం స్థానిక ఆదిత్య డిగ్రీ కాలేజ్, గంగాలమ్మ గుడి దగ్గర, KGRL కాలేజ్ రోడ్ కు చేరుకోవాలని, కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *