సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక కార్యాలయం నందు నేడు, గురువారం కమిషనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని హోటళ్లు రెస్టారెంట్లు మరియు పాస్ట్ ఫుడ్ సెంటర్ల యాజమాన్యల వార్లతో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు పై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఈ సమావేశంలో కమిషనర్ వారు మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో గల 34 వార్డు రాయలం రోడ్డు వెంబడి ఈట్ స్ట్రీట్ ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి అని దానికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందని దీని ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుందని మరియు ఒకే ప్రాంతాములో పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదమైన వాతావరణంలో అన్నీ రకాల ఆహారాలు అమ్మకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున ఆసక్తి కలవారు వాటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అన్ని వార్డుల శానిటేషన్ సెక్రటరీలు, అన్ని డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ కమిషనర్ వారు మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ వారు, మరియు మున్సిపల్ ఇంజనీర్ వారు పాల్గొన్నారు.
