సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత గురువారం రాత్రి 9 గంటల 15 నిమిషాల నుండి భారీపిడుగులతో కూడిన భయంకరమైన వర్షం గంటన్నర పాటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. విద్యుత్తూ సరఫరా 3 గంటల పాటు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా దక్షిణ ఒడిశా నుండి కోస్తా ఆంధ్ర తీరం రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి మరింత బలపడి రేపటికి (అక్టోబర్ 11) అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో వచ్చేవారం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
