సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలోని ఫై అంతస్తు లో శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి నూతనంగా 19 న్నర కేజీల వెండి మకర తోరణం అందించడం గొప్ప విశేషమని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, శుక్రవారం సోమేశ్వరాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబును కలిసి మకర తోరణ వివరాలను తెలిపారు. ఈనెల 12వ తేదీన ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి సుమారు రూ 30 లక్షలు విలువ కలిగిన 19 న్నర కేజీల వెండితో తయారుచేసిన మకర తోరణం అలంకరణ చేస్తున్నారని అన్నారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మాట్లాడుతూ అమ్మవారికి 19 న్నర కేజీల వెండి మకర తోరణాన్ని పట్టణానికి చెందిన బోండా వెంకట సుబ్రహ్మణ్య (బుజ్జి బాబు) అందిస్తున్నారని, ఈనెల 12వ తేదీన ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి అలంకరణ చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ సభ్యులు యార్లగడ్డ రమేష్, పెద్దింటి చరణ్, ఆలయ ఈవో రామకృష్ణంరాజు, అర్చకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
