సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక భక్తులు వచ్చే ప్రసిద్ధ దేవాలయం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో శాశ్వత నిత్యాన్నదానంకు ఇప్పటి వరకు ప్రత్యేక భవనం లేదా స్థలం లేక, ఉన్న కాస్త జాగాలో భక్తులు దేవస్థానం సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, గురువారం శ్రీమావుళ్ళమ్మ నిత్యాన్నదాన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇక భక్తులకు అన్నసమారాధన ప్రసాదం తీసుకొనే సమస్య తీరినట్లేనని, ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణ జరిగేలా స్థలం ఏర్పాటు అయ్యిందని అన్నారు, అమ్మవారి ఆలయం ఎదురుగా యేలుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ జరిగేలా నిర్మాణానికి ఏర్పాట్లు ( 5 ఏళ్లకు అంగీకారం) జరుగు తున్నాయని, దాతలు అందిస్తున్న సహకారం మరువలేదని అన్నారు. త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో , ధర్మకర్తల మండలి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *