సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా వెంకటాపురం లో వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ (YCP) కి చెందిన కాపు సామాజికవర్గ నేతల ఆత్మీ య సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక వర్గ కార్యక్రమాలు , కాపులపై జరుగుతున్న దాడుల గురించి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ,వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ,మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై దానికి అండగా మరో 15 ఏళ్ళు ‘కాపు’కాస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినో అధికారం లో కూర్చోబెట్టడానికి ఈ సమావేశాలు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాపు కార్పొరేషన్ ద్వా రా ఏడాదికి రూ. 3 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, మరి ఈ ప్రభుత్వంలో కాపులకు ఏం? న్యాయం జరిగిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తాము ‘కాపు నేస్తం ’ ద్వారా లబ్ధి చేకూర్చా మని గుర్తు చేస్తూ.. ఉన్న పథకాలను తీసేస్తామంటే కుదిరేది లేదని హెచ్చరించారు. అధికారం ఉందని కాపులకు ద్రోహంచేస్తున్నారు.. చేస్తూ రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని, త్వరలోనే విశాఖపట్నం , తిరుపతిలలో కాపు సామాజికవర్గ సమావేశాలు భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
