సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రుతుపవనాలు గమనం మందగించిన ద్రోణి ప్రభావం తో ఆంధ్ర లో వర్షాలు పడుతున్నాయి. తాజగా ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, రాయలసీమలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల మేఘాలు ఆవరించాయి. గత ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఇదే క్రమంలో నేడు, సోమవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి అంటే ఈనెల 23 నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాల పయనంలో వేగం పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
