సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: తాజగా అందిన వాతావరణ సమాచారం ప్రకారం.వాయువ్య బంగాళాఖాతం.. దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిన క్రమంలో ఏపీలో గోదావరి జిల్లాల తీర ప్రాంతాలలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు, ఆదివారం ఉదయం నుండి కోనసీమ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలతో పాటు భీమవరంలో నేటి సాయంత్రం నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు రానున్న బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు ఉపయో గించడం సురక్షితం కాదని తెలిపింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు (సోమవారం) మధ్యాహ్నం లోపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయి.
