సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తరుచు టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు తో సహా వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అని అది అధికారంలోకి వస్తే హింసే అని పలుమారులు ప్రస్తావించడం పట్ల ఇప్పటివరకు సబ్దు గా ఉన్న వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఎదురు దాడికి దిగింది. అవును.. మాది గొడ్డలి పార్టీ యె.. చంద్రబాబు వంటి . నారా’ కాసురుల అవినీతిని, నేతల అహంకారాన్ని తెగనరకడానికి ప్రజా బలంతో గొడ్డలి పట్టిన పరుశురాముడి లా జగన్ వస్తున్నాడు.. ఇక చూసుకోండి .. అంటూ .. ఇటీవల వైసీపీ పార్టీ నేత సజ్జల రామకృష రెడ్డి టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. వైరల్ చేస్తున్నారు. దానితో పాటు AI తో చేసిన పరశురాముడి గెటప్ లో వై యస్ జగన్ ను పెట్టి మంచి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో వీడియో చేసారు.. దానికి బోనస్ గా దుర్మార్గులయిన రాజులను సంహరించడానికి పరుశురాముడు వస్తే లక్షల సైన్యం అడ్డుకోలేరని ఆయనకు నమస్కరిస్తారని చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు కూడా జత చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *