సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్‌ మెటల్‌ ల్యాడల్‌ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్‌లో తీవ్ర వేడితో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదస్థలిలో వెంటనే 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో మరో ఇద్దరు మరణించినట్లు తెలుస్తుంది..ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పేరిగే అవకాశం స్వష్టంగా కనపడుతుంది.గాయపడిన వారిని వెంటనే.. హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ల్యాడల్‌లోని ద్రవ లోహం ఎందుకు కిందపడింది?, సాంకేతిక లోపమా? లేక భద్రతా ప్రమాణాల్లో ఏవైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *