సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపి, ఎన్నో వివాదాలు, ఉద్రిక్తతలు, కోర్ట్ కేసులు అధిగమించి ఎట్టకేలకు ఆకివీడు లో రామాలయం పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. బహుశా విజయదశమికి ప్రారంభించే దిశగా స్థలం చిన్నది అయినప్పటికీ చాల అందంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. తాజగా జరుగుతున్న రామాలయ పునర్నిర్మాణ పనులను గత సాయంత్రం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పర్యవేక్షించారు. పనులు చక్కగా, వేగంగా కొనసాగుతున్నాయని, అలాగే ఆలయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న నూతన రహదారి కూడా మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని రఘురామ తెలిపారు.
