సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేజీఎఫ్‌’, సిరీస్ హిట్స్ ఇచ్చిన పాన్ ఇండియా క్రెజ్ తో హీరో యశ్‌ ద్విపాత్రాభినయం చేస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 4 ఏళ్ళ నిర్మాణం తరువాత నేడు, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే ఈ సినిమాను సుమారు 400 కోట్ల కర్చుతో కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ నిర్మించారు. మలయాళీ నటి గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు మరి ‘టాక్సిక్’ కథ గురించి చెప్పాలంటే,, ఇదో పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ స్టోరీ! 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినా… గోవా మాత్రం దశాబ్దం పైగా పోర్చుగీసు వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడ మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారంలో ఆధిపత్యం కోసం కొన్ని ముఠాలు తరచూ గొడవలు పడుతూ ఉంటాయి. తన అక్క గంగ (నయనతార)తో కలిసి ఆ నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు రాయ (యశ్‌). తమ్ముడిని ఎలాగైనా నేర సామ్రాజ్య సింహాసనంపై కూర్చోపెట్టాలన్నది గంగ కోరిక. ఎందరో గ్యాంగ్ స్టర్ లను ఎదుర్కొంటారు. అయితే గోవాకు వచ్చిన రాయల్ సర్కస్ లోని అందాల సుందరి నదియా (కియారా అద్వానీ)ని చూసి మోజు పడిన రాయ,. నదియా ప్రవేశంతో కధ ఎన్నో మలుపులు తిరుగుతుంది.ఇక విశ్లేషణకు వస్తే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ తుపాకీ తూటాలు, గ్రెనేట్‌ ప్రేలుళ్ళ చప్పుళ్ళతో చెవులు చిల్లులు పడిపోతాయి. దానికి తోడు అందమైన భామలతో హీరోగారి కామ కలాపాలు. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా విఫలం అయ్యారు ఉన్నంతలో సినిమా ఇంటర్వెల్ వరకు బాగుంది. ఆతరువాత టాక్సిక్‌ ఓ టార్చర్ గా మారిపోయింది. పతాక సన్నివేశంలో ప్రేక్షకుల ఊహకు అందని ఓ ట్విస్ట్ ఉంది.హాలీవుడ్ తరహాలో ఒక సినిమా చేసాం అన్న తృప్తి హీరో యాష్ కి మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *