సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం, కాళ్ళ మండలం, కోపల్లె గ్రామం వద్ద స్టేట్ హైవేపై ఎన్నో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన స్థానంలో చేపట్టిన కోపల్లె 4 లేన్ల నూతన వంతెన నిర్మాణంలో భాగంగా, కేవలం 5 నెలల వ్యవధిలో ముందుగా నిర్మించిన 2 లేన్ల వంతెనను నేడు, బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి తో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. అతి త్వరలోనే పూర్తి స్థాయి 4 లేన్ల వంతెనను అప్రోచ్ రోడ్లతో సహా పూర్తిచేసి ఘనంగా ప్రారంభిస్తామని, అలాగే కోపల్లె గ్రామంలో ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, బయోకెమిస్ట్, దివంగత డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద నిర్మిస్తున్న పార్క్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని రఘురామ అన్నారు.
