సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వారం నాలుగు రోజులు కాస్త అటు ఇటుగా వెళ్ళిపోయినా స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం నేడు, శుక్రవారం మాత్రం భారీ షాక్ ఇచ్చి భారీ నష్టాలలో పడేశాయి. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దాదాపు 300 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్ ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. 10 నిమిషాల్లోనే భారీగా కుదేలై ఒక దశలో 1300 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరికి కాస్త కోలుకొని చివరకు సెన్సెక్స్ 1092 పాయింట్ల నష్టంతో 74,776 వద్ద సెషన్ ముగించింది. నిఫ్టీ 360 పాయింట్లు తగ్గి 23548 వద్ద స్థిరపడింది. మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 470 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకుపైగా తగ్గి రూ. 465 లక్షల కోట్లకు చేరుకుంది.అయితే తలపండిన ఇన్వెస్టర్లు కూడా అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ తిన్నారు.
