సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గాజువాకలో నేడు ఆదివారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొనగా ఆ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు సుమారు 30 మంది ప్రయాణికులుతో రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపునకు వెళ్తోంది. అయితే, ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో గాజువాకలోని శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ అదుపు తప్పింది.పోలీసులు వచ్చి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతులు, క్షతగ్రాతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
