సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడులో తెలుగు ప్రాంతాలలో ఎన్డీఎ లోని అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పర్యటన ఆ అభ్యర్థులను విజయాల వైపు తీసుకోని వెళ్లలేకపోయింది. ఆయా స్థానాలలో విజయ్ పార్టీ అభ్యర్థులే విజయ డంఖా మ్రోగించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజగా ట్విటర్ లో స్పందించారు…ఈ ఫలితాల ద్వారా ఎన్డీయే మరింత బలపడిందనే విషయం రుజువైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమి తరుఫున విజయం సాధించిన వారికి, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ( up file photo)
