సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రజలు మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ ఫై తిరుగుబాటు చేస్తూ తీర్పు చెప్పిన దరిమిలా.. ఘోర పరాజయాలతో ట్రంప్ దూకుడు కు అడ్డుకట్టపడినవేళ .. అంతర్జాతియ మార్కెట్ లు జోష్ నెలకొన్నాయి. చమురు ధరలు మరింత తగ్గాయి. భారత్ లో దేశీ స్టాక్ మార్కెట్ నేడు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఇటీవల కాలంలో కనీవినీఎరుగని రీతిలో ఏకంగా 2 వేల పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగియగా నిఫ్టీ 24,500 మార్కును దాటింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి..నేడు సెన్సెక్స్ 2,008.21 పాయింట్ల లాభంతో 79,310 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50,576 పాయింట్ల లాభంతో 24,536.60 వద్ద ముగిసింది. సెనెన్స్లో బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్‌గా (7.7 శాతం) నిలిచింది. ఇండిగో షేర్లు కూడా 5.80 శాతం మేర లాభపడ్డాయి.బ్యాంకింగ్ షేర్స్ తో పాటు సెక్టోరల్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి.
