సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భారతీయ విలువలకు డి ఎన్ ఏ గా చెప్పుకొనే రామచంద్రుడు -రామాయాణం కథతో తెలుగులోనూ ఇతర భారతీయ బాషలలో ఇప్పటికేచాలా సినిమాలు వచ్చాయి.. తాజాగా అలా వచ్చిన సినిమానే రామాయణ పార్ట్ 1. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇందులో శ్రీరాముడుగా రణ్బీర్ కపూర్,సీతాదేవిగా సాయి పల్లవిరావణుడుగా యశ్, రవి దూబె, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, లారా దత్తా తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్, మహేష్ లిమాయే అందివ్వగా సంగీతం: హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్ అందించారు. కద విషయానికి వస్తే.. రామాయణం అందరికి తెలిసిన కధే.. అయితే ఈ కధ లో రావణుడు బాల్యం నుండి దేవతల చేతిలో రాక్షసులుపడ్డ కష్టాలు అవమానాలు నుండి చూపించారు. రాముడు, సీత,వనవాసం రావణుడు, సీతాపహరణం వరకు మాత్రమే చూపించారు. రావణుడు జటాయువు పక్షితో చేసే ఫైట్ క్లయిమ్యాక్స్ అద్భుతంగ తీసి మొదటి భాగానికి ముగింపు పలికారు. ఇక సినిమా ను విశ్లేషిస్తే.. ఇది రావణుడు కోణంలో చూపించారు. అతని చెల్లెలు శూరపునక వివాహం ఆమె భర్త ను రావణుడు సంహరించడం కొత్తగా చూపించారు. రావణుడి సహనం ..10 తలలుతో సంభాషించే తీరు కొత్తగా చూపారు.. యష్ తన నటనతో జీవం పోశారు. శూరపునక పాత్రలో రకుల్ ప్రీత్ బాగా చేసింది. మండోదరి పాత్రలో కాజల్ మెరిసింది అంతే .. నిజం నిష్ఠురమైన రాముడుగా రణ్బీర్ కపూర్,సీతాదేవిగా సాయి పల్లవి అసలు సెట్ కాలేదు. రణబీర్ చెక్క ముఖం లో అసలు ఉద్వేగ బావాలు పలకలేదు. సీత కు ఉండవలసిన సౌమ్యం, అందం,అభినయానికి సాయి పల్లవి ఎక్కడ సెట్ కాలేదు. పైగా ఆమె చేసే కత్తి యుద్దాలు, పెట్టె పరుగులు నవ్వు పుట్టిస్తాయి. ఏకంగా 2000 కోట్లు పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ అంటూ హడావిడి చేసినప్పటికీ ఒక్క క్లయిమాక్స్ తప్ప దాదాపు అన్ని సన్నివేశాలు నాసిరకం క్వాలిటీలోనే ఉన్నాయి. ఏ మాత్రం హాలీవుడ్ ప్రమాణాలు లేవు.. సినిమా 70 శాతం చీకటిలోనే తెమిల్చేసారు.. సినిమాలో సన్నివేశాలు తక్కువ సంభాషణలు తో టకటక వెళ్లిపోతాయి కానీ సినిమా భారంగా టివి సీరియల్ మాదిరి భారంగా నడుస్తున్నట్లు ఫీలింగ్. సినిమాలో పాటలు ఉన్నపటికీ ఆకట్టుకొనేలా చిత్రీకరించలేదు. అయితే రి రికార్డింగ్ మంచి క్వాలిటీతో ఉంది. ఈ సినిమా కోసం జీవం లేని సన్నివేశాలతో దర్శకుడు నితీష్ తివారి వృధా ప్రయాస పడ్డారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నపటికీ కనీసం పాటలు మ్యూజికల్ హిట్ అయ్యి దేశాన్ని ఊపేసాయి. 10 ఏళ్ళ క్రితం బాలకృష్ణ , నయనతార తో బాపు తీసిన రామాయణం క్వాలిటీలోను విజువల్ ఎఫెక్ట్స్ ఈ బాలీవుడ్ రామాయణం కంటే ఎంతో బెటర్.
