సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శనివారం ఉదయం పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 64 మంది దంపతులు మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు గొంతెన రమణ పాపోలు ఏడుకొండలు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
