సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి త్వరలో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు శుక్రవారం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి జూన్ 8 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. జూన్ 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. జూన్ 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వివరించింది. జూన్ 18వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, రాజస్థాన్‌లో 3, జార్ఖండ్‌లో 2 స్థానాలతో పాటు మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీతో వైసీపీ నుంచి ఎంపికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ‘రిలయన్స్’ పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు టీడీపీ నుంచి ఎంపికైన సానా సతీష్ పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలోని పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు ఆయా పార్టీలు సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
