సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం మరో వారం పొడిగించింది. ఒక ప్రక్క ప్రచండ ఎండలు మరో ప్రక్క ఈ జూన్ 5 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జూన్ 1కి బదులుగా జూన్ 6 నుంచి కాలేజీలు ప్రారంభం కానుండగా, పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో తిరిగి విద్యాలయాలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల ప్రారంభ తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది.అయితే ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్లోని ఇతర కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి
