సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాంచరణ్ హీరోగా ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీన భారీ అంచనాలతో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకుప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ భారతీయ బాషలలో ప్రీమియర్ షో ఉండనుంది. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. జూన్ 4వ తేదీనుంచి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై రూ.125.. సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
