సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల కోసం జనసేన పార్టీ.. కూటమి పార్టీలు ఆమోదించిన సీట్ల మేరకు తొలి అభ్యర్థుల జాబితాను నేడు, శనివారం విడుదల చేసింది. జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. తొలి జాబితాలో రెండు కార్పొరేషన్లకు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, మరియు ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డప్ప నాయుడు ను ప్రకటించారు. ఇక మున్సిపాలిటీల చైర్మెన్ అభ్యర్థులు: అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నల్లా శ్రీధర్. చిలకలూరిపేట – తోట రాజరాజేశ్వరి. గొల్లప్రోలు – కడారి తమ్మయ్య నాయుడు. నరసాపురం – కొత్తపల్లి శైలజ. నిడదవోలు – కల్లం జ్యోతి. పెడన – మట్టా శివపావని. పిఠాపురం – డాక్టర్ బీరా విజయ్శేఖర్. పుత్తూరు – డి.ఏలుమలై. సాలూరు – గొర్లె విజయకుమారి. సామర్లకోట – పిట్టా జానకి రామారావు. తెనాలి – తోటకూర వెంకట రమణారావు. తిరువూరు – పి. మాధవి
