సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 59వ దసరా మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని లక్షలాది రూపాయల కరెన్సీ నోట్ల తో అలంకరించిన శ్రీ అమ్మవారిని మందిరం దర్శించారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో అమ్మవారి దసరా మహోత్సవాలను ఆర్యవైశ్య యువజన సంఘం గత 58 ఏళ్లుగా నిర్వహించడం అభినంద నీయమని, ఊరు వాడలంతా అమ్మవారి సంబరాలతో భక్తి భావం ఉట్టిపడుతోందని, ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు..
