సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు ,(ఏప్రిల్ 23), గురువారం నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్, అదాన్ నయీం అస్మి, ఐపీఎస్ పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రమాదాలకు నిలయంగా మారిన ‘బ్లాక్ స్పాట్స్’ (తరచూ తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాలు) ను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు (NHAI), ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్, రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ పర్యటనలో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, పోడూరు, ఎలమంచిలి, నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల పరిధిలోని 23 బ్లాక్ స్పాట్ల వద్ద రహదారి నిర్మాణ లోపాలు మరియు ప్రమాదాలకు దారితీస్తున్న సాంకేతిక కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించారు. గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లలో వచ్చే రెండు నుండి మూడు నెలల వ్యవధిలో 100 శాతం భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు, బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు మరియు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు , తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *