సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనివిని ఎరుగని ఎండల దాడికి ఉష్ణోగ్రతలు తీవ్రత పెరిగి వడదెబ్బతో పలువురు మృతి చెందటంతో పాటు వేలాదిగా అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు కరెంట్ కోతలు పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లా రురల్ ప్రాంతాలలోనే కాదు జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో కూడా కారణాలు ఏవైనా అనధికార విద్యుత్తూ కోతలు ప్రతి రోజు ఉదయం రాత్రి కూడా అమలు చేస్తున్నారు. ఎండలు తట్టుకోలేక సామాన్య పేద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గంటల పాటు విద్యుత్తూ సరఫరా నిలిచిపోవడంతో ఇన్వెక్టర్స్ కూడా పనిచేయక పిల్లలతో వృద్ధులతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు ఉడుకు జ్వరాలు వడ దెబ్బ పాలవుతున్నారు.నేడు ఆదివారం జిల్లా వ్యాప్తగగా 42 డిగ్రీలకు తగ్గకుండా ఎండలకు తోడు భీమవరం లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రమో 4 గంటల వరకు విద్యుత్తూ సరఫరా నిరవధికంగా నిలిపివేయడంతో సెలవు రోజు కూడా ప్రశాంతత లేక ప్రజలు విలవిలా లాడారు. ఇన్వెక్టర్స్ కూడా పనిచేయక.. బయటకు వెళ్ళటడమంటే తీవ్రకరమైన వేడిగాలులు ఇంటిలో ఉంటె ఉక్కపోత.. ఒక గంట విద్యుత్తూ సక్రమంగా వస్తుందన్న భరోసా లేదు.. వర్షాలు కురిపించి దేవుడే ప్రజలను కాపాడలేమో? ఇక 1గంట రాత్రి వర్షం కురిస్తే 3- 5 గంటలు కరెంట్ ఉండదు.. ఇదో కొత్త బాధ.. ఏ కాలంలోనైనా భీమవరంలో నిక్షేపంగా బ్రతికేసే దోమల గోల మరో బోనస్..
