సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల స్కూల్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజగా నేడు, గురువారం ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ఒక బైక్ను ఢీకొట్టి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడగా బైక్ ఫై ఉన్న ఇద్దరిలో .. ఓ వ్యక్తి మృతిచెందారు. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న స్కూల్ బస్సు.. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆపై పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బైక్ ఫై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
