సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి కేవలం 11 కిమీ దూరంలో కాళ్ళకూరు గ్రామంలో 460 ఏళ్ళ క్రితం నిర్మించిన పురాణ ప్రాశస్యం ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంకి విశేషంగా భక్తులు వస్తున్నా నేపథ్యంలో వారి సౌకర్యార్ధం శ్రీవారి ప్రాశస్యం తెలిపే విధంగా అభివృద్ధి పనులలో భాగంగా దేవాలయం చుట్టూ మాడవీధులు విస్తరణలో భాగంగా స్థలాల కొనుగోలు కు ఇటీవల భక్తులు దాతలు విశేషంగా స్వాందిస్తూ విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా నేడు, శనివారం స్వామివారికి స్థలం కొనుగోలు నిమిత్తం ఏలూరుపాడు వాస్తవ్యలు కీ.శే. పచ్చిగోళ్ళ అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్ధము భర్త వెంకట సుబ్బారావు కుమారడు నాగమురళి గుఫ్త, కృష్ణ వేణి దంపతులు మరియు మనమురాలు చిట్టూరి లీలా నాగ లలిత అనుపమ, భర్త వెంకట సుబ్రహ్మణ్యం శరత్, పచ్చిపులుసు మల్లికా పూర్ణ గాయిత్రి భర్త కృష్ణ సిద్ధార్థ రూ. 1,01,116/- ( అక్షరాల ఒక్క లక్ష ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయిలు)దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ మరియు పాలకమండలి అధ్యక్షులు అడ్డాల.శివరామరాజు మరియు పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు సమక్షమున అందజేయడం జరిగినది. దాతలను అభినందించి వారికి స్వామి వారి శేష వస్త్రం ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేయడం జరిగింది
