సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: విజయవాడ దగ్గర మున్నేరు వాగు వద్ద ఐదుగురు చిన్నారులు గల్లంతు అయినట్లు వస్తున్నా వార్తలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మున్నేరు దగ్గరకు చిన్నారులు వెళ్లారు. చిన్నారులు ఇప్పటివరకూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నేరులో గల్లంతయ్యారా? లేక అవతలి ఒడ్డుకు వెళ్లారా అనేదానిపై అనుమానం వ్యక్తమవుతోంది. మున్నేరు ఒడ్డునే పిల్లలకు సంబంధించిన సైకిల్‌, బట్టలను స్థానికులు గుర్తించారు. చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మున్నేరు వాగు వద్దకు వెళ్లి ఈతగాళ్లు సహకారంతో ఆధారాలు పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *