సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలోఇటీవల మరణించిన, సినీ హీరో, నిర్మాత ఘట్టమనేని రమేష్ సంస్మరణ సభను భీమవరం జేపీ రోడ్డులోని శ్రీ దత్త అష్టలక్ష్మి దేవాలయం సెంటర్లో నేడు, సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భముగా కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తూ,, రమేష్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భముగా పలువురు పేదలకు ఆహారపు పాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయప్రోలు శ్రీనివాస మూర్తి, బి హెచ్ సుబ్బరాజు, గంటల ప్రసాద్, బోనం వరప్రసాద్, టి ఉదయ్ తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *