సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధ దాడుల నేపథ్యంలో దేశీయ సూచీలకు నష్టాలను మిగిల్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.70) మరింత పడిపోయింది. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 4.5 శాతం పెరిగి 97.16 డాలర్లకు చేరుకుంది. . ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి ( stock market).గత సెషన్ ముగింపు (74,243)తో పోల్చుకుంటే, నేడు, సోమవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. చివరకు సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టంతో 73,524 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 243 పాయింట్ల నష్టంతో 23,123 వద్ద స్థిరపడింది ( indidan stock market ).బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 849 పాయింట్లు నష్టపోయింది.
