సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తీ అయిన నేపథ్యంలో.. ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి.ఇటీవల ఇరాన్ మిత్ర దేశం లెబనాన్ ఫై శాంతి ఒప్పందానికి విరుద్ధంగా బీకర దాడులతో పలు పట్టణాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయిల్ సేనలు లక్ష్యంగా గత ఆదివారం తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) నేటి సోమవారం ఉదయం ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి భీకరమైన వైమానిక దాడులకు దిగింది. నిజానికి గత రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు చేసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని గుర్తుచేస్తూ, ఇరాన్‌పై ఎలాంటి ఎదురుదాడి చేయవద్దని, ఇరుపక్షాలకూ ఇప్పటికే సరిపడా నష్టం జరిగిందని సూచించారు. “వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు, ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్న హింసే మరల కొనసాగుతుంది” అని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం ఆ మాటలను లెక్కచేయకుండా నేరుగా సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
