సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వాతి కిరణం, ‘యాత్ర’ వంటి ఎన్నో డైరెక్ట్ చిత్రాలతో తెలుగు వారికీ సుపరిచితమైన మలయాళ సినీ సూపర్ స్టార్ మమ్ముట్టి ( మహమ్మద్ మాముద్ కుట్టి) వయస్సు ఏకంగా 75 ఏళ్ళు దాటుతున్న పిట్ నెస్ లో కానీ గ్లామర్ లో కానీ ఒరిజినల్ హెయిర్ లో గాని ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం. యూత్ కు ఏమాత్రం తీసిపోని కుర్రడిలా కొడుకు దుల్కర్ సల్మాన్ కు పోటీ ఇస్తూ ఇప్పటికి క్యారెక్టర్ కోరుకున్న విధంగా చెలరేగి పోతున్నారు మమ్ముటి. . తెలుగు లో 35 ఏళ్ళ క్రితం ఆయన నటించిన సామ్రాజ్యం, కంకణం డబ్బింగ్ చిత్రాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో?ఇప్పటి తరానికి తెలియదు. అపట్లో తెలుగులో ఘనవిజయం సాధించిన ‘దళపతి’ సినిమాకు వేసిన 24 షీట్ పోస్టర్ లో కేవలం మమ్ముటి ని మాత్రమే వేసి రజనీకాంత్ ను ప్రక్కన పెట్టేసారు. భారీ క్రెజ్ , దళపతి నుండి ప్రతి డబ్బింగ్ సినిమాకు సైతం తానే తెలుగులో గంబీరమైన కంఠంతో వాయిస్ ఇచ్చిన ఘనుడు. ys రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర లో నటించిన 5 ఏళ్ళ తరువాత ‘యాత్ర 2’ చేస్తే పాత్రలో వాచికంలో ఎటువంటి మార్పు లేదు.. దటీజ్ మమ్ముటి. తాజాగా కొచ్చిలో జరిగిన ‘ప్రవేక ఫిల్మ్ కంపెనీ’ ప్రారంభోత్సవ వేదికపై మమ్ముట్టి మెరిసిన తీరు నెటిజన్లను కట్టిపడేసింది. పూర్తిగా వైట్ అండ్ వైట్ రౌండ్-నెక్ టీషర్ట్, లూజ్ బ్యాగీ ట్రౌజర్‌తో మోనోక్రోమ్ లుక్‌లో వచ్చిన ఆయన దానికి సరిపోయేలా ధరించిన టర్కోయిస్ లోఫర్ షూస్‌తో సరికొత్త స్టైల్ స్టేట్‌మెంట్‌ను నెలకొల్పారు. ఆయన నూనె వేపుడు లేని కాయగూరలు ఆహారంతో పాటు రెగ్యులర్ గా జిమ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లోనే రెసిస్టెన్స్, స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేస్తారు. కండర పుష్టితో పాటు శారీరక ఒత్తిడి దూరం కావడానికి గాఢమైన నిద్రకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *