సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల కు చెందిన డీజీపీలు, ఐజీపీల సమావేశం డిసెంబరు 4వ తేదీ నుంచి 6 తేదీ వరకు జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి నేడు, సోమవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటర్ డిపార్టుమెంటల్ కమిటీ సమావేశం జరిగింది. . ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొనే సమావేశం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
