సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ముచ్చటగా మూడవసారి కోస్తా ఆంధ్ర వైపు ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు మరో తుఫాన్ దూసుకొని వస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 960 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ చెన్నైకి 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఇది ఈ నెల 17న ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు తీవ్ర తుఫాన్‌గా కొనసాగనుంది. తర్వాత మరింత బలపడి 18 రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారి 19న ఉదయం వరకు కొనసాగనుంది.ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాఆంధ్ర గోదావరి జిల్లాలలో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ .. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *