సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఒక్కసారిగా జనసేన, టీడీపీ పెద్దలపై బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస తీవ్ర ఆగ్రహంతో భీమవరంలో బీజేపీ అన్ని వార్డులలో ఒంటరిగా పోటీ చేస్తుంది అన్న ప్రకటనతో ఎన్నికల వాతావరణం మారిపోయింది. మరో ప్రక్క ఆయన రాజకీయ వారసుడు గా ఆయన మేనల్లుడు ‘వినోద్’ మునిసిపల్ ఎన్నికలలో ‘వర్మ’ ఆసిర్వాదం తీసుకోని వార్డు స్థానిక కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసారు. ఇదిలా ఉండగా నేటి ఉదయం స్థానిక కూటమి నేతల తీరుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ మాటలలో.. ఎన్డీఏ కూటమిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ 2వ విడతలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నా 4 పట్టణాలలో బీజేపీ పార్టీకి కూటమి పార్టీలలో వార్డుల పంపిణీలో తణుకులో 4, తాడేపల్లిగూడెంలో 4, పాలకొల్లులో 3 వార్డులతో పాటు వైస్ చైర్మన్ పదవి, కేటాయించారని భీమవరంలో 5 వార్డులు, ఒక మైనారిటీ కో-ఆప్షన్ సభ్యుడి పదవిని కేటాయించేలా ప్రాథమికంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, భీమవరం మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులకు సంబంధించి బీజేపీకి ఐదు వార్డులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ, ఏయే వార్డులు కేటాయించాలనే అంశంపై ఐదు వార్డుల్లో కేవలం రెండు వార్డులకు మాత్రమే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిందని, మిగిలిన మూడు వార్డులపై బీజేపీకి కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి చర్చలు జరపకుండా టీడీపీ, జనసేన పార్టీలు చెరో 24 వార్డులకు తమ అభ్యర్థుల జాబితాలను ఏకపక్షంగా ప్రకటించడం పొత్తు ధర్మం ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు. బీజేపీకి కేటాయించినట్లు చెబుతున్న5వార్డుల విషయంలోనూ అన్యాయం జరిగిందని నాలుగు వార్డులను వదిలిపెట్టారని, అందులో ఒకటి మిత్రపక్షాలకు అవసరం లేనిది కాగా, మిగిలిన మూడు తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వార్డులేనని తెలిపారు. భీమవరం వన్‌టౌన్‌లోని 33 వార్డుల్లో ఒక్క వార్డును కూడా బీజేపీకి కేటాయించకపోవడం ఏమిటి?” అని ఆయన నిలదీశారు.
