సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ లో సుమారు 8 ఏళ్ళు తరువాత చైర్ పర్సన్, వార్డు కౌన్సెలర్స్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ లో గతంలో ఉన్న 39 వార్డుల నుండి విలీన గ్రామాలూ ఓటర్లు కలిపి 52వార్డులకు విస్తరించింది. అయితే కూటమి పార్టీలలో అభ్యర్థుల ఎంపికలో గందరగోళం, అలకలు తప్ప ప్రజలలో అన్ని పార్టీల క్యాడర్ లో ఎన్నికల జోష్ పెద్దగా కానరావడం లేదు. చైర్ పర్సన్ అభ్యర్థులుగా జనసేన, వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నేటి సోమవారంతో నామినేషన్ పక్రియ ముగిసింది. భీమవరం పురపాలక సంఘం స్థానిక కార్యాలయంలో నేటి మద్యాహ్నం 22న్నర గంటల సమయానికి అధికారికంగా నమోదు అయిన మొత్తం 194 : నామినేషన్ల తాజా వివరాలు: పార్టీల వారీగా మొత్తం నామినేషన్లు:🔹 వైఎస్సార్సీపీ – 54🔹 స్వతంత్ర అభ్యర్థులు – 52🔹 టీడీపీ – 41🔹 జనసేన – 34🔹 బీజేపీ – 6🔹 కాంగ్రెస్ – 4🔹 బీఎస్పీ – 1🔹 సీపీఐ – 1🔹 సీపీఎం – 1 మొత్తం: 194 అభ్యర్థులు మొత్తం 52 వార్డులకు నామినేషన్లు వేశారు. ఇక ఎన్నికల అధికారులు వీటిని పరిశీలించవలసి ఉంది. ఎంతమంది విత్ డ్రా చేసుకొంటారో కూడా చూడాలి..
