సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానము నందు కార్తిక మాసంలో నేడు 7 వ రోజు మొదటి సోమవారం నేపథ్యంలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంకు నేటి తెల్లవారు జాము నుండి భక్తులు పోట్టెత్తిపోయారు. స్వామివారి దర్శనం కోసం నేటి సాయంత్రం వరకు ఆలయమునకు సుమారు గా 50,000 మంది పైగా భక్తులు విచ్చేయగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా క్యూ లైన్ లలో దర్సనలు జరిగాయి .మరో ప్రక్క ఎన్నికలలో నామినేషన్ వేసే అభ్యర్డుల ప్రత్యేక పూజలు కూడా వేగంగా జరిగాయి. నేడు ప్రత్యేక దర్శనముల టికెట్స్ ద్వారా రూ 5,50,262/-రూపాయలు, లడ్డు ప్రసాదం విక్రయం వలన రూ. 38,295/-రూపాయలు వెరశి 5,88,557/-రూపాయలు లభించింది. మరియు శ్రీ స్వామివారి ఆలయం ఆవరణలో వేలాది మంది భక్తులకు నిర్వహించిన నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ 2,00,699/-రూపాయలు ఆదాయం లభించింది అని కార్యనిర్వహణాధికారి. ఆకుల కొండలరావు తెలిపారు. ఫై తాజా చిత్రంలో స్వామివారి దివ్య అలంకరణ దర్శించుకోండి.
