సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్? కేసుకు సంబంధించి కేసులో ఏపీ డీజీపీ, విజయవాడ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు,బుధవారం జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి తల్లి పిర్యదు చేసిన పోలీసులు ఛార్జి షీట్ పట్టకపోవడం.. విచారణ తీరుపై ఏపీ పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ?,, ఇప్పటి వరకు సాయి కృష్ణ మృతదేహం కూడా దొరక్క పోవడం ఫై సుప్రీం కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ హైకోర్టులో విచారణపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేంతవరకూ హైకోర్టులో విచారణను నిలిపివేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.పోలీసు కస్టడీలో సాయికృష్ణ అదృశ్యమవడం చట్ట వ్యతిరేకమే అని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. సీల్డ్ కవర్‌లో కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ సెప్టెంబర్ 30వ తేదీలోగా సుప్రీంకోర్టుకు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులందరకీ నోటీసులను జారీచేసిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
